![]() |
![]() |

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -233 లో..... పెద్దసారుపై వీరు ఎటాక్ తో రుద్ర షాక్ అవుతాడు. వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. వీరు హాస్పిటల్ కు వచ్చి ఇలా ఎలా జరిగిందని ఏం తెలియనట్లు యాక్టింగ్ చేస్తాడు. ఖచ్చితంగా ఇదంతా ఎవడో కావాలనే చేసాడు.. వాడి సంగతి చెప్పాలి అన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇద్దామని సూర్య అంటాడు. ఎందుకు తొందరపాటు.. ముందు మావయ్యని కోలుకొనివ్వండి అని ఇషిక అంటుంటే అంటే ఏంటి ఇషిక.. వదిలేయ్ మంటావా మావయ్యని ఆ పరిస్థితిలో చూడలేక పోతున్నానని ప్రమీల అంటుంది.
నువ్వు కూడా మాట్లాడుతున్నావా.. అసలు నువ్వు బయటకు వెళ్లి బిజినెస్ చూసుకోవడం వల్లనే కదా.. ఈ ఇంటికి అరిష్టం వచ్చిందని శకుంతల అనగానే ప్రమీల ఏడుస్తుంది. డాక్టర్ వచ్చి ప్రమాదం ఏం లేదని చెప్తాడు. మీరు అందరు వెళ్ళండి. నేను పెద్దనాన్న దగ్గర ఉంటానని రుద్ర అంటాడు. అవసరం లేదు నేను వీరు ఉంటామని శకుంతల అనగానే సరే వీరు ఉండు అని రుద్ర అంటాడు. లేదు అత్తయ్య ప్రీతీకి బీపీ డౌన్ అయింది. నేను వెళ్ళాలని వీరు అంటాడు. మీరు కూడ రండి అత్తయ్య.. రుద్ర బావ చూసుకుంటాడని వీరు అంటాడు. అందరు వెళ్ళిపోతారు.. బావ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కాల్ చెయ్ బుల్లెట్ స్పీడ్ లో వస్తానని రుద్రతో వీరు చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత వీరు, ఇషిక ఒక కార్ లో వెళ్తారు. ఎదురుగా రుద్ర హెల్మెట్ పెట్టుకొని ఉంటాడు. ఎవరు అతను అని ఇషిక అడుగుతుంది. రుద్ర అని వీరు చెప్తాడు. ఇప్పుడు వెళ్లి ఆ మొహానికి ఉన్న మాస్క్ పోయేలా చేస్తాను.. నువ్వు వీడియో తియ్.. రుద్ర నాపై ఎటాక్ చేసాడని ఇంట్లో అందరికి చూపిస్తానని ఇషికకి వీరు చెప్పి వీరు కార్ దిగుతాడు. వీరుని రుద్ర కొడుతాడు. దెబ్బ బయటకు కన్పించకుండా రుద్ర కొడతాడు. వెంటనే రుద్ర వెళ్ళిపోతాడు. అదేంటీ బ్రో అలా కొట్టి వెళ్ళిపోయాడని ఇషిక అంటుంది. ఇంట్లో ఈ విషయం చెప్దామని ఇషిక అనగానే అవసరం లేదు దీన్ని ఇంతటితో వదిలేయ్.. అవసరం వచ్చినప్పుడు నేను చూసుకుంటానని వీరు అంటాడు.
ఆ తర్వాత పెద్దసారు డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు. ఇంట్లో అందరు తనతో పాటు ఉంటే ఎవరి పనులకి వారు వెళ్ళండి అని పంపిస్తారు. రుద్రతో మాట్లాడుతాడు పెద్దసారు. నీకు ముందే డౌట్ వచ్చింది కదా నీలో టెన్షన్ చూసాను.. నువ్వు ఈ కుటుంబానికి ఏం కాకుండా కాపాడుతావు.. ఎవరో ఈ కుటుంబాన్ని పగ పట్టారని పెద్దసారు అంటాడు. లేదు పెద్దనాన్న బిజినెస్ పరంగా కుట్రలు అంతేనని రుద్ర చెప్తాడు. అదంతా వీరు వింటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |